సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తాజా వార్త! పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ IAS, నియమితులయ్యారు ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్ గా సేవలు అందించిన పి ప్రశాంతి ఇకపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక నూతన కలెక్టర్ గా వస్తున్నా యువకుడు సుమిత్ కుమార్ పశ్చిమ గోదావరి వాసులకు జిల్లా విభజనకు ముందు నరసాపురం జోన్ సబ్ కలెక్టర్ గా బాగా సుపరిచితులు ఆయన హర్యా నా రాష్ట్రం లోని రోహతక్ జిల్లాలోని కోనూర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబం లో జన్మించారు. 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి తదుపరి, ఇంజినీరింగ్ పూర్తీ చేసి గురుగావ్‌లో నాలుగేళ్లు పాటు ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తూనే తనకు ఇష్టమైన సివిల్స్ ఫై ద్రుష్టి పెట్టి 2014లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనను ఏపీ క్యా డర్‌కు కేటాయించారు. మొదట అనం తపురంలో ట్రైనీ కలెక్టర్‌గా పని చేసిన తరువాత, నరసాపురం సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. 29 ఏళ్ల వయసులోనే జిల్లాలో కీలకమైన నరసాపురం రెవెన్యూ సబ్‌డివిజన్ అధికారిగా 14 నెలల పాటు విధులు నిర్వహించారు. అవినీతి కి దూరంగా పాలనా పరంగా నిబ్బద్దత కల అధికారిగా పని చేసారు.ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఇప్పుడు మరల జిల్లా కు కలెక్టర్ గా రావడం అందరు హర్షించదగినదే..
