సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో భారీగా కలెక్టర్ లు బదిలీలు జరిగాయి. దీనిలో భాగంగా వచ్చి కొద్దీ కాలం అయిన చక్కగా బాధ్యతలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకొంటున్న యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు కు బదిలీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా నాగ రాణి నియామకం జరిగింది.అతి త్వరలో ఆమె భీమవరం లోని జిల్లా కలెక్టరేట్ లో బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ గ వెట్రి సెల్వి నియామకం జరిగింది. ఇక గుంటూరు కలెక్టర్ గా నాగలక్ష్మి, అల్లూరి జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్, కాకినాడ జిల్లా కలెక్టర్ గా సాగి శన్మోహన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పి ప్రశాంతి ( గతంలో పశ్చిమ గోదావరికి పనిచేసారు) విజయనగరం జిల్లా కలెక్టర్ గా బి ఆర్ అంబేద్కర్ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారీయా, కర్నూల్ జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టర్ గా జేసీ కి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
