సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే పోలీసులు గంజాయి, ఇతర మత్తు మందుల రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. జిల్లాలో పలు చోట్లా రైళ్లు లో ప్రయాణికుల బ్యాగులు కూడా తనిఖీలు చేస్తున్నారు. గత సోమవారం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, రైళ్లలో భీమవరం రైల్వే లైన్ సీఐ ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. చాల కాలంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి రైళ్లలో గంజాయి రవాణా అవుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్టు సీఐ భాస్కరరావు తెలిపారు. ఎస్‌ఐ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామని భీమవరం జీఆర్పీ ఎస్‌ఐ పీటీవీ రమణ ప్రకటించారు. సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ విశాల్ గున్ని (విజయవాడ) ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేశారు. . ఎవరైనా గంజాయి తీసుకొనివెళుతున్నట్లు అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానిత సరుకు కనబడినా ప్రయాణికులు రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.
