సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేస్తున్న ఖర్చును, వాటికీ అనుమతులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి జిల్లాస్థాయి ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. బహిరంగ సభలు, ర్యాలీల ద్వారా ప్రచారాలు, స్టార్ క్యాంపెయినర్, హెలికాప్టర్ ఖర్చులు, సినిమా హాళ్లు,ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు, ఎలక్ట్రానిక్, ప్రింట్, కేబుల్ నెట్ వర్క్ ద్వారా,ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు సోషల్ మీడియా ద్వారా వీడియో ప్రచార చిత్రాల ప్రసారం, పాంప్లెట్లు, పోస్టర్లప్రింటింగ్, వాహనాలు, వీడియో తదితర ఖర్చుల లెక్కింపు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ ఛానెల్స్ లో ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను (పెయిడ్ న్యూస్), స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం, నిబంధనలకు మించిన ఖర్చుకు అభ్యర్థులు పాల్బడితే, పక్కాగా గుర్తించాలన్నారు. ప్రచారానికి రిజిస్టర్డ్ పార్టీలు మూడు రోజులు, రిజిస్టర్ కాని పార్టీలు ఏడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రచార పర్వము ముగిసాక వార్తాపత్రికల్లో వేసే పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు తప్ప నిసరిగా ఎంసీఎంసీ నుంచి అనుమతి పొందిన తర్వాతే ప్రకటన ప్రచురించాల్సి ఉందన్నారు. ఉల్లంఘనలపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *