సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో సీఎం జగన్ అగ్రకుల పేద మహిళలకు 45 నుం చి 60 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రభుత్వం ఈబీసీ నేస్తం పేరిట ఏడాదికి రూ.15 వేల చొప్పు న 2వ విడుత ఆర్థిక సాయం నేడు, బుధవారం వారి వారి ఎకౌంట్ లలో జామా చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించిన తదుపరి ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కు నమూనా అందజేస్తారు.జిల్లా వ్యాప్తంగా అగ్ర వర్ణాల లోని పేద మహిళా లబ్ది దారులకు ఈబీసీ నేస్తం 13,460 మందికి రూ 20.19 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమా అయ్యింది. గతేడాది మొదటి విడత ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో 28,470 మందికి రూ.42.70 కోట్లను ప్రభుత్వం జామా చెయ్యగా 2వ విడుత లబ్ధిదారులు తగ్గటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు(రూ.కోట్లలో) భీమవరం 1,491 లబ్దిదారులకు 2.23 కోట్లు జమ కాగా, ఉండి 2,129 మందికి 3.19, నర్సా పురం 504 మందికి 0.75 పాలకొల్లు 1,446 మందికి 2.16 ఆచంట 2,555 మందికి 3.83 తణుకు 3,278 మందికి 4.91 తాడేపల్లిగూడెం 2,057 మందికి 3.08 కోట్లు మంజూరు అయ్యాయి.
