సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుపాను శాంతించింది. నేడు, గురువారం భారీ వర్షాలు తగ్గాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలకొల్లు నరసాపురం లలో నేటి తెల్లవారు జాము నుండి ఉదయం 7వరకు స్వల్ప వర్షం మినహా ఎండ ప్రకాశవంతంగా కాయడంతో ప్రజలు ఊపిరి తీసుకొన్నారు. నరసాపురం మండలం చినలంకకు వెళ్లే నల్లీక్రిక్ కాజ్‌వే వంతెనకు గండిపడింది. అక్కడ ఆక్వా చెరువులు మునిగిపోయి భారీ నష్టం ఏర్పడింది. తణుకు జోన్ లో పంట పొలాలు కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఆకివీడు సమీపంలో కొల్లేరు లో వరద ప్రవాహం తగ్గలేదు. ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ప్రకటించింది. . కృష్ణ , కొల్లేరు సరస్సు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ హెచ్చరించింది.
