సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దారుణ పరాజయం వైసీపీ నేతలతో పాటు కూటమి లోని టీడీపీ జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఊహించనిది కావడం తో ఎందుకిలా జరిగిందని కారణాలు అన్వేషిస్తున్నారు. ఎదో మాయ జరిగిందని ప్రత్యర్థులకు ఇంతంత భారీ మెజారిటీలు వచ్చేసాయని? వైసీపీ శ్రేణులు మదన పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. నిజానికి జిల్లాలోని 7 సీట్లలో ఎన్నికలకు ముందే 5 సీట్లలో వైసీపీ పరాజయం ఖాయం అని కాస్త రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా లెక్కకట్టారు. ఇక భీమవరంలో, సంక్షేమంతో పాటు వార్డు వార్డు లో సీసీ రోడ్లు, డ్రైన్స్ , కొత్త సచివాలయాలు, వంతెనలు , కరోనా సమయంలో మంచి సర్వీస్ అందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నమ్మకస్తులయిన క్యాడర్ దూరంగా ఉండిపోయారు. కీలకమైనవారు అంజిబాబు పక్షం చేరిపోయారు. అయినా గతంలో పవన్ కళ్యాణ్ నే ఓడించిన ఆయన ఎదో రకంగా గట్టెక్కుతారని ఒక నమ్మిక,. అయితే బరిలో దిగారంటే ‘అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్’ అనే పేరున్న పులపర్తి రామాంజినేయులు ఈసారి ఏకంగా 65 వేల మెజారిటీ సాధించడం అందరిని విస్తు పోయలే చేసింది. మరో ప్రక్క ఉండి నియోజక వర్గంలో ఆఖరి వరకు టీడీపీ అభ్యర్థుల మార్పులు.. రెబల్ గా శివరామ రాజు భారీగా మహిళా ఓట్లను చీల్చారని ప్రచారం వైసీపీ లో కాస్త అంచనాలను పెంచాయి. కానీ త్రిముఖ పోటీ లో సైతం తానే ఊహించని భారీ మెజారిటీ తో 60వేల పైగా ఓట్ల తో ఎంపీ రఘురామా తన RRR బ్రాండ్ సత్తా చాటారు. ఇక ఆచంట లో కాస్త అవకాశాలు ఫై వైసీపీ అంచనాలు వేశారు. కానీ వైసీపీ పాలన ఫై నిరాశతో ఉన్న మగవారు.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలకు దొరికేసిన మహిళలు వృద్దులు మరొకటి తలచి ‘సర్వే’ లకు దొరక్కుండా గుంభనంగా తమ పని కానిచ్చేశారు.నిజానికి పారదర్సకత పాలన పేరుతొ కరెంట్ బిల్లు ఎక్కువయిందని, ఎక్కువ ఇంటి పన్ను కడుతున్నాడని జగన్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు వైసీపీ మద్దతుదారులకే అందలేదు. విద్యాదీవెనలు , అమ్మవడి లు అందుకొన్న యువత, విద్యార్థులు ‘పవనిజం’ తో తమకు కొత్తగా వచ్చిన ఓట్ల సత్తా చూపారు. దానితో వైసీపీ జిల్లాలో ఖాళీ అయిపొయింది. రాష్ట్రంలో వైసీపీ కి కేవలం 11 అసెంబ్లీ సీట్లను కాస్త గౌరవ ప్రదంగా 4 ఎంపీ సీట్లను మాత్రమే కేటాయించారు. సంక్షేమం ఎక్కువ అయ్యి తిన్నవాడికే తినిపించడం తో వెగటు పుట్టిందని, అసలు ఏమి పెట్టకపోక పన్నులు , కరెంట్ బిల్లులు బాదేయడంతో మధ్యతరగతి వాళ్లకు మండిపోయిందని, నా బిసిలు, మైనారిటీలు, నా ఎస్సీ ఎస్టీలేనా.. మన ఓసీలు లేరా ? అంటు జగన్ ను ఉన్నత వర్గాలలోని మద్దతుదారులు కూడా ఎవరికీ వారు వదిలెయ్యడం వల్లె ఈ దారుణ పరిస్థితి వచ్చిందని భావించవచ్చు. అయితే గుడ్డిలో మెల్ల సీట్లు తక్కువ వచ్చిన సుమారు 40 శాతం ఓటింగ్ ఉండటం, రాజ్యసభ లో 11 మంది ఎంపీలతో కలపి ఇప్పడు 4 కలిపి 15 మంది ఎంపీలు ఉండటం, శాసనమండలి లో ఎమ్మెల్సీలతో పూర్తీ ఆధిక్యతలో ఉండటం వైసీపీ ప్రస్తుతం బాలలు. వాటిని కాపాడుకోవాలి అంటే జగన్ కూడా రాజకీయం నేర్చుకోవాలి.. నిజాయితీ పరుడిని..విలువలు పాటిస్తాను ..వందమంది వచ్చిన ఒంటరిగా పోరాడతాను అంటే.. ఇంతే సంగతులు .. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *