సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో, జిల్లాలోనూ కొత్త ఏడాదిలో అసాంఘిక శక్తులపై నిఘా ఉంటుందని, ఎక్కడైనా జూదాలు బెట్టింగ్ లు పై ఉక్కు పాదం మోపుతామని ఎస్పీ యు.రవిప్రకాశ్ భీమవరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రకటించారు. సంక్రాంతి పండుగల వేళా… కోడిపందేలబరులు, జూదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి నిర్వాహకులకు హెచ్చరికలుతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 2022 లో 7,084 కేసులు నమోదుకాగా ఈ ఏడాది కేసులు సంఖ్య 5,932కు తగ్గిందన్నారు. స్పందనలో వచ్చిన 3,420 ఫిర్యాదుల్లో 2,901 పరిష్కరించామన్నారు. మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై నిఘా ఉంచామన్నారు. లోక్అదాలత్ లో అత్యధిక కేసులు రాజీ జరగటంతో మన జిల్లా ప్రత్యేక స్థానాన్ని పొందిందన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ బి.శ్రీనాథ్, భీమవరం సీఐలు అడబాల శ్రీను,గుత్తుల శ్రీను పాల్గొన్నారు
