సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు ఇక ఏప్రిల్ లో జరుగుతాయి అని భావిస్తున్న నేపథ్యంలో ఒక ప్రక్క సీఎం జగన్ రేపు శుక్రవారం భీమవరంలో జగనన్న విద్య దీవెన అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేనలు కూడా తమ ఎన్నికల సమరాన్ని జనవరి 5 నుండి తమ పర్యటనలు ప్రారంబిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కొత్త ఏడాది జనవరి 5వ తేదీ నుండి చంద్రబాబు నాయుడు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నుండి ప్రారంభిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగుదేశం ఇంచార్జ్ మాజీ MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.ఈ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. తణుకు పాలకొల్లు తాడేపల్లి గూడెం, నరసాపురం లను కవర్ చేస్తూ భీమవరం తో 5 రోజులలో పర్యటన ముగించే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూలు ఖరారు కావలసి ఉంది. (పైన రెడ్ మార్క్ పేర్కొన్న 3 నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ కి సిద్ధం అవుతున్నారు మరి..)
