సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి బుధవారం ఆలయంలో పవిత్రాధివాసం వైభవంగా నిర్వహించారు. గత మంగళవారం రాత్రి . ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛ రణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. అక్కడ పవిత్రాలను ఉంచి పూజలు చేశారు. అనంతరం మండపారాధనను నిర్వహించారు. ఆలయంలో ఏడాదిపొడవునా తెలిసి. తెలియక జరిగిన తప్పుల ప్రాయఃచిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం.
