సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తుపాను రాకుండా పోయిందని సంతోషపడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలలు నిప్పులు చెరిగే ఎండ దెబ్బకు విలవిలా లాడుతున్నారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో గత 6రోజులుగా ఎండల తాకిడి ,బాగా పెరిగిపోవడం తో పాటు జిల్లాలో ప్రధాన కేంద్రం భీమవరం మొదలుకొని దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రతి రోజు సగటున 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. ప్రచంఢ భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు కు ఉదయం 7గంటల నుండే తీవ్ర ఉక్కబోత మొదలు పెడుతుంది. 8గంటల నుంచే ఎండ మొదలవుతుంది. ప్రధాన రహదారులు జనసంచారం లేక ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి. రాత్రి పూట కూడా వడగాల్పులు తగ్గటం లేదు. ఏసీ లు కూలర్లు లేకుండా రాత్రి పడుకోవడం కష్టంగా ఉంటుంది. చిన్నారులు పెద్దలు ఉడుకు జ్వరాల భారిన పడి ఆసుపత్రిలు రద్దీగా ఉంటున్నాయి. ప్రజలు అవసరం అయితే ఎండలో తప్ప బయటకు వెళ్ళకూడదు. వేసవి చిట్కాలు పాటిస్తూ , పండ్లు, అల్లం మజ్జిగ ,పానీయాలు చల్లని కుండ నీరు తీసుకొంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
