సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు, రేపు సోమవారం రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూలు ఖరారు అయ్యింది. నేటి ఆదివారం పిఠాపురం నుంచి హెలీ కాఫ్టర్‌లో నర్సాపురం చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొని తదుపరి రోడ్డు మార్గంలో భీమవరం వెళతారు. నేటి సాయంత్రం 6న్నర గంటలకు ప్రకాశం చౌక్ సెంటర్‌లో నిర్వహించే సభలో మాట్లాడి రాత్రికి భీమవరంలోనే బస చేస్తారు. రేపు, సోమవారం భీమవరం నుంచి మధ్యాహ్నం తాడేపల్లిగూడెం వెళ్లి, సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అనంతరం గణపవరం వెళ్లి సభలో పాల్గొంటారు. తదుపరి భీమవరం చేరుకుని రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం భీమవరం లో ఎన్డీయే కూటమి నేతలతో కొద్దీ సేపు సమీక్షా చేసిన తరువాత తిరిగి పిఠాపురం బయలుదేరతారు. పవన్ కు ఇంకా అస్వస్థతగా ఉండటం తో ప్రచారంలో అభిమానులు ఎవరు పువ్వులు విసరటం లాంటి పనులు చెయ్యవద్దని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
