సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బెట్టింగ్ ల పర్వము జోరు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. పోలింగ్ ముగిసాక ఒక పార్టీ తరపున అభ్యర్థుల గెలుపు ఫై ఒకటికి 2డింతలు అంటూ కోసు పందాలకు సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థులు ఎవరికీ వారు స్వంత సర్వేలు వార్డుల వారీగా చేయించుకొన్నాక అభ్యర్థులతో పాటు బెట్టింగ్ రాయుళ్లలో కూడా ఆలోచన మొదల్యయింది. ఎన్నికలు లో ఇరు వర్గాలు సర్వము ఒడ్డి తమ మద్దతు దారులను వెతికి పట్టుకొని వచ్చి ఓట్లు వేయించారు. గతం కన్నా జిల్లా వ్యాప్తంగా 2 శాతం పైగా ఓటింగ్ పెరిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ మొదట ‘తమ ప్లస్ లను మాత్రమే లెక్క కట్టుకోనప్పటికీ ఇప్పడు తమ మైనస్ లు కూడా’ అవగతం అవుతున్నాయి. పైగా లోక్ సభకు జరిగిన క్రాస్ ఓటింగ్ అసెంబ్లీ అభ్యర్థుల కొంప ముంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏకపక్ష గెలుపు ఫై పందాలు కాసినవారు తేరుకొని ఇప్పుడు రివర్స్ పందాలకు పార్టీలను వెతుకుతున్నట్లు తెలుస్తుంది.. అది వాళ్ళ వృతి మరి.. ఏది ఏమైనా అసెంబ్లీ అభ్యర్థులకు బొటా బొటా మెజారిటీలతో గట్టెక్కుతారు.. అభ్యర్థులు ఏ పార్టీ వారు గెలిచిన ఉండి , అచంట, నర్సాపురం లో మెజారిటీలు స్వలపంగా ఉండే అవకాశం ఉంది.ఇక్కడ అభ్యర్థులకు ఓట్లతో పాటు అదృష్టం తోడు కావాలి. ఇక భీమవరం 5 -10వేలు , టీపీ గూడెం, తణుకు, పాలకొల్లు నియోజకవర్గాలలో 8 -12వేల లోపు మెజారిటీలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. ఒక్క నరసాపురం లోక్ సభ మాత్రం ఎవరు గెలిచిన 50 వేలు దాటి మెజారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. లోక్‌సభ స్థానాల పరిధిలో పోలింగ్ ముందు వున్న బెట్టింగుల జోరు.. ఆ తర్వాత మారిపోయింది. ఇరువురు ప్రధాన పార్టీల అభ్యర్థులలో గెలుపు ఫై అదే ధీమా కనపడుతుండటం మరో విశేషం..కాబట్టి పందాల రాయుళ్లు కాస్త పందాలకు దూరంగా ఉంటె మంచిది. అసలు మెజారిటీల జోలికి వెళ్లకుండా ఉంటె మంచిది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా నమ్మలేం.. ఓటు వేసిన అందరికి ఇంటర్యూలు చేసి వారేమి ఫలితాలు ప్రకటించరు. ఎదో ఓటింగ్ లో 5 శాతం మంది అభిప్రాయాలతో కచ్చితమైన ఫలితాలు ఎలా తెలుస్తారు? కేవలం ‘ఊహలను నమ్మితే’ ఏమి జరుగుతుంటుందో గతంలో పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛతీస్ గడ్ రాష్ట్రాల ఫలితాలు చూపించాయి కదా! అక్కడ ఎంతమంది బెట్టింగ్ రాయుళ్లు రోడ్డున పడ్డారో? ఎవరో రెచ్చగొట్టారని రేచిపోవద్దు.. ఇంకెంత? 5రోజులు జూన్ 4వ తేదీవరకు వేచి చుడండి.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
