సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పల్లెలలో తరచూ విద్యుత్తూ కోతలు విధించడంతో ప్రజలలో అసహనం వ్యక్తమౌతోంది. దీనితో విద్యుత్ శాఖ అదిత్క్రులు ఈ నెలలో విద్యు త్ లభ్య త తక్కు వగా ఉన్నందున, పెరుగుతున్న గ్రిడ్ డిమాండ్ కారణం గా ఈ నెల 5 నుంచి అంటే రేపటి మంగళవారం నుండి జిల్లాలో పరిశ్రమల విద్యుత్ వినియోగం పై ఈ నెల 15వ తేదీ వరకూ కోత విధిస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ.సాల్మ న్ రాజు ప్రకటించారు. దీనితో ఇకపై గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యు త్ అంతరాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యా ప్తం గా వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ సరఫరా చేయాలం టే ఈ నియం త్రణ తప్ప నిసరి చేయాలం టూ ఉత్తర్వు లు జారీ చేశారని వివరించారు. జిల్లాలో నిరంతరంగా నడిచే పరిశ్రమలు తమకు నిర్దేశిం చిన లోడులో రోజుకు 30 శాతం తగ్గించుకుని వినియోగించాలని సూచించారు.
