సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దురదృష్టం పగబడితే ఎలా ఉంటుందో ఈ ఘటన చెబుతుంది. ఒక ప్రక్క దీపావళి వేడుకలు.. మరో ప్రక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అగ్ని ప్రమాద జాగ్రత్తలు తీసుకోని నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో గత బుధవారం సాయంత్రం పిడుగు పడటంతో పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది. మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిడుగు పడిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో సుమారు 20 మంది ఉన్నారు అని తెలుస్తుంది.ఎదో బాంబు పేలుడు జరిగిందని తీవ్ర భయాందోళనలతో కొందరు బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
