సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్ర ప్రబుత్వ ఆదేశాలతో మరోసారి వయస్సులో పెద్దలకు ప్రికాషన్‌ (బూస్టర్‌) డోసు వ్యాక్సిన్‌ పంపిణీ ని పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా గత సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు డోసులు వేయించుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసును కాల పరిమితితో నిమిత్తం లేకుండా వేయగా, 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు మాత్రం రెండు డోసుల తర్వాత తొమ్మిది నెలలు పూర్తయితేనే బూస్టర్‌ డోసుకు అనుమతించారు. వీరిలో దీర్ఘకాలిక రోగాలు వున్న సీనియర్‌ సిటిజన్లను వైద్యుల సూచనల మేరకే బూస్టర్‌ డోసు వేయించుకోవాలని కోరారు. గత సోమవారం సాయంత్రానికి బూస్టర్‌ డోసుకు అర్హులైన వారిలో 11 వేల 533 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 15–18 ఏళ్ల వయస్సు బాల బాలికలందరికీ నూరు శాతం తొలి డోసు వ్యాక్సినేషన్‌ నిన్న సోమవారం సాయంత్రానికి పూర్తీ చేసారని సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *