సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఎవరు ఆకలి తో ఉండకూడదని చాల స్వల్ప ధరకు అంటే రూ.5లకే టిఫిన్‌, భోజనం అందించేందుకు గతంలో 2019 ఎన్నికలకు కొద్దీ నెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణ నిలిపివేసింది. వాటిలో కొన్నింటిని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు గా మార్చారు. అయితే మరల అన్న క్యాంటీన్‌లను పునరుద్దరిస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీనిపై పేద వర్గాల నుండి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లాలో భీమవరం, పాలకొల్లు తాడేపల్లిగూడెం, తణుకు, , నరసాపురం, పట్టణాల్లో అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారు. అయితే పాలకొల్లులో అన్న క్యాంటిన్‌ వద్దనే ప్రతీ రోజు దాతల సహకారంతో ఇప్పటికి భోజనాలను అందిస్తున్నారు. టీపీ గూడెం తణుకులలో కూడా కొన్ని ప్రాంతాలలో ఉచిత కాంటీన్స్ టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అదికారంలోకి రావడంతో జిల్లా లో నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్‌ను మరల క్లీన్‌ చేశారు. చెత్త మెక్కలను తొలగించారు. క్యాంటీన్‌ ప్రారంభించేందుకు వీలుగా రెడీ చేస్తున్నారు. నరసాపురంలో అన్న క్యాంటీన్‌ వైసీపీ హయాంలో నేడు పోలీస్‌స్టేషన్‌గా మారింది. అయితే భీమవరంలోని మూడు క్యాంటీన్లు సచివాలయాలుగా మారిపోయాయి. టూటౌన్‌ అడ్డవంతెన వద్ద, పాత బస్‌ స్టాండ్‌ వద్ద, బుధవారం మార్కెట్‌ లోని మునిసిపల్‌ కాంప్లెక్స్‌ వెనుక భాగంలో అధునాతన సకల సౌకర్యాలతో అప్పట్లో క్యాంటీన్‌లు ఏర్పాటు చేశాారు. మరి ఈసారి ఎక్కడ ‘అన్న క్యాంటీన్స్’ ఏర్పాటు చేస్తారో?వాటినే కొనసాగిస్తారో? చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *