సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అందరు ఊహించినట్లే.. ఇటీవల సంక్రాంత్రి పర్వదినాల తదుపరి కోవిద్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లులలోని ప్రభుత్వాసుపత్రులతో పాటు, కొవిడ్‌ పోజిటివ్ బాధితులకు వైద్య సేవలందించేందుకు ప్రైవేటు రంగంలో తాజాగా మరో పది ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను తాజాగా నోటిఫై చేశారు. దానిలో భాగంగా భీమవరంలో భీమవరం హాస్పటల్‌, ఏలూరులోని చైత్ర హాస్పటల్‌, మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌, జంగారెడ్డిగూడెం శ్రీ సూర్య నర్సింగ్‌ హోం, జానకీ నర్సింగ్‌ హోం, తణుకు యాపిల్‌ హాస్పటల్‌, జాబిల్లి హాస్పటల్‌, విజయ హాస్పటల్‌, తాడేపల్లిగూడెంలో వైష్ణవి హాస్పటల్‌, పాలకొల్లులో సుఖీభవ నర్సింగ్‌ హోంలను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించారు. వీటన్నింటిలో ఐసీయూ బెడ్స్‌ 163, ఆక్సిజన్‌ జనరల్‌ బెడ్స్‌ 346, జనరల్‌ బెడ్స్‌ 231 పడకలను కొవిడ్‌ వైద్య సేవల కోసం కేటాయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *