సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గత ఏడాదిగా నిమ్మ కాయల ధరలు అప్పుడు అప్పుడు మినహా మంచి డిమాండ్ పలుకుతూనే ఉన్నాయి. ఇక ఈ వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు అతి సాధారణం. గత నెలలో అకాల వర్షాలు నేపథ్యంలో నిమ్మ దిగుబడి తగ్గిపోవడం తో గత 2వారాలలోనే క్వింటా ధర దాదాపు రూ.2,500 పెరిగింది. ఈ నెలారంభంలో క్వింటా నిమ్మకాయల ధర రూ.6 వేలు ఉండగా..ప్రస్తుతం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మ మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన ఏలూరు, దెందులూరు లలో క్వింటా ధర గరిష్ఠంగా రూ.8,700 దాకా పలుకుతోంది. కనిష్ట ధర రూ.3,500 ఉంది. అన్‌సీజన్‌లో క్వింటా రూ.1000 కూడా పలకని నిమ్మకాయలను ఇప్పుడు ఈ-నామ్‌ పోర్టల్‌ ద్వారా కొందరు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. బండ్ల మీద రిటైల్‌ వ్యాపారులు కాయ సైజును బట్టి పెద్దవి ఒక్కొక్కటి రూ.10కు, చిన్నవి రూ.5 చొప్పున అమ్ముతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *