సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ అసెంబ్లీ, నరసాపురం లోక్ సభ ఎన్నికలలో నేడు, గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్స్ వెయ్యడానికి సిద్ద పడుతున్నారు. వీరిలో రేపు శుక్రవారం మంచి ముహూర్తం ఉండటంతో జిల్ల్లా కేంద్రం భీమవరం నుండి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల నామినేషన్స్ వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉండి నియోజక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ? ఎంపీ రఘురామా కృష్ణంరాజు నామినేషన్ వేసే అవకాశం.. స్వష్టంగా కనపడుతుంది. వాస్తవానికి ఆయన ఈ నెల 22 న వేస్తాననని ప్రకటించినప్పటికీ ముహూర్త బలం తో రేపే నామినేషన్ వెయ్యడానికి సంసిద్దులవుతున్నట్లు సమాచారం.. ఇక భీమవరం నియోజకవర్గం నుండి జనసేన,కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పులపర్తి అంజిబాబు ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసే అవకాశం ఉంది.
