సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా భీమవరం పట్టణం ఎడతెరపి లేని వర్షపు ముసురు లో కొనసాగుతుంది. సూర్యుడు కానరావడం లేదు.. వాతావరణం ఆహ్లదంగా ఉన్నప్పటికీ వ్యాపార వర్గాలు మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, తాడేపల్లి గూడెం, చింతలపూడి జంగారెడ్డి గూడెంలో గత బుధవారం మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులలో కూడిన భారీ వర్షాలు పలు చోట్ల కురిశాయి. వర్షాలతో జిల్లాలోని రైతాంగం తమ పొలాలలో వరి నారుమడు లు, నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వాతావరణంలోని విపరీతమైన తేమ తో చేపలు రొయ్యలు పండిస్తున్న ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు వైరస్ లు విజృంభణాలు , వైరల్ జ్వరాలు ఎక్కువయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షంతో ఉమ్మడి జిల్లాలో భీమవరం ఏలూరు లతో సహా గ్రామాలూ ప్రధాన పట్టణాలలో జనజీవనం స్థంభించింది. రహదారులు చిత్తడిగా తయారయ్యాయి. అసలే జిల్లాలో ఇంకా బాగుకు నోచుకోని రోడ్లు గతుకుల సమస్య వాహనాల ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారుతున్నాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
