సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో మరో ప్రక్క ఉన్నత చదువులకు కౌన్సిలింగులు ప్రారంభము అయినవేళ విద్యార్థులు మీసేవ, సచివాలయాల చుట్టూ కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం తెగ తిరుగుతున్నారు. అయితే ఆ సేవలకు సంబంధించి సర్వర్‌ నిలిచిపోవడంతో వారికీ కీలకంగా కావలిసిన కుల, ఆదాయ ధ్రువపత్రాలు అందటం లేదు. ఈ పరిస్థితి మరి కొద్దీ రోజులు తప్పక పోవచ్చునని తెలుస్తుంది. నిజానికి గత మూడునెలలుగా రెవెన్యూ సేవలు ఎన్నికల కారణంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వం మారడంతో రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలు, శాఖల సర్వర్‌లలో తాజా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఈ పరిణామం తో మీ–సేవ, సచివాలయాల సేవలు నిలిచి పోయాయి. మరో మూడు లేదా 4 రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *