సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జాయింట్ కలెక్టరు రామ్ సుందర్‌రెడ్డి ఖరీఫ్ ధాన్యం సేకరణపై సివిల్ సప్లయిస్ అదికారులకు రైస్ మిల్లర్స్ ప్రతినిధులకు సూచించారు. అవసరమైన గోనెసంచులు మూడు రోజుల్లోగా సిద్ధం చేసుకో వాలని కోరారు. మంగళవారం ఖరీఫ్ ధాన్యం సేకరణపై సివిల్ సప్లయిస్ అధికారులు, జిల్లా రైస్‌మిలర్లతో జేసీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 314 రైతు భరోసా కేంద్రాల ద్వారా 4 లక్షల 65 వేల 393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. గత రబీ పంటకాలానికి సంబంధించి బియ్యం సేకరణ ఇంకా 66 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్ల నుంచి తీసుకోవాల్సి ఉందని వాటిని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం మద్దతు ధర గ్రేడు ఏ రకం క్వింటా 2,203, సాధారణ రకం క్వింటా 2,183 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర అందేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
