సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. మొత్తం పశ్చి మగోదావరి జిల్లా వ్యాప్తంగా 81.12 ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. , జిల్లాలో 7 నియోజకవర్గాల పరంగా ఓటింగ్ శాతం గమనిస్తే గత 2019 ఎన్నికలలో కన్నా ప్రతి చోట సుమారు 2 శాతం పైగా ఓటింగ్ పెరిగింది. భీమవరంలో ప్రస్తుతం 79.35%ఓటింగ్ నమోదు అయ్యింది. ( గత 2019 లో 77.94% వచ్చింది) త్రిముఖ పోటీ జరుగుతున్నా ఉండి లో ఏకంగా జిల్లాలో అత్యధికంగా 86.20% ఓటింగ్ నమోదు అయ్యింది. (2019 లో 84.75% వచ్చింది) పాలకొల్లు లో 82.28% ( గతంలో 82.24% పెద్ద మార్పు లేదు ) నరసాపురం 84.38%( గతంలో 81.19%) తాడేపల్లిగూడెం 81.86%( గతంలో 80.35%) తణుకు 82.12%( గతంలో 81.17%) నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న కీలకమైన గోదావరి జిల్లాల వ్యాప్తంగా చుస్తే.. . డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19, ఏలూరులో 83.04, తూర్పు గోదావరి 79.31, కాకినాడ జిల్లాలో 76.37 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.అన్ని చోట్ల సుమారు 2 శాతం పోలింగ్ గతం కన్నా అదనంగా వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *