సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా పలువురు IAS అధికారులు లు బదిలీలు జరిగిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కు నూతన కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ IAS…ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత కలెక్టర్ కార్తికేయ మిశ్రా IAs ఇకపై రాష్ట్ర ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ కానున్నారు. కొద్దీ కాలం క్రితం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రకియ వేగంగా అమలు చేసే ప్రక్రియ లో భాగంగా జిల్లాలోని తాసీల్ధార్ లతో కొద్దీ కఠిన వైఖరి అవలంబించడం, , తెలుగు పదాలతో పూర్తీ పట్టు లేక ఫోన్లో అధికారులపై మాట తులారని వివాదం మినహా కార్తికేయ మిశ్రా సమర్ధవంతమైన అధికారిగా జిల్లాకు సేవలు ఇప్పటివరకు అందిస్తున్నారు. జిల్లాలో కోవిద్ కట్టడికి అయన చేసిన సేవలు ప్రసంశనీయం..
