సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 5వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఆహ్లాద వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో కలెక్టరేట్ లో మీట్ నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 5న ఈ మెగా మీట్ కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులను విద్యాలయాలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థులకు తాగునీరు, భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో ఈ.నారాయణ, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
