సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో నేడు మకర సంక్రాంతి రోజు కోడి పందాలు ఉపందుకొన్నాయి. నేడు, సోమవారం భీమవరం పరిసర ప్రాంతాలలో వేల సంఖ్యలో కోళ్లు కాళ్లు దువ్వాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 300 పైగా బరుల్లో పందేలు జోరుగా పందేలు కొనసాగాయి. భీమవరం శివారులోని పెదమీరంలో, సీసలిలోనూ ఒక్కో పందెం రూ. 25 లక్షల నుండి 50వరకు వెళ్లింది అని వినికిడి.. బరులకు తెలంగాణ నుంచి పందాల రాయుళ్లుపోటెత్తారు. ఉండి మండలం మహదేవిపట్నంలో పందేలు అత్యధికంగా గెలుచుకునేవారికి బుల్లెట్‌ బహుమతిగా ప్రకటించారు.ఆ చించినాడ గోదావరి సమీపంలో తిరునాళ్లను తలపించే రీతిలో భారీ టెంట్లతో కోడిపందాలు, జూదాలుకు విశేషంగా వందలాది కారులలో బయటిప్రాంతాల పందాల రాయుళ్లు హాజరు అయ్యారు. గుండాట, కోతాటలు జోరుగా సాగుతున్నాయి. కలగంపూడి, యలమంచిలిలో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో ఈ ఏడాది పందాల జోరు అధికంగా ఉంది. ఏపీ నిట్‌ సమీపంలో పందేలు నిర్వహించారు. నరసాపురం లో గత ఏడాది కంటే అత్యధికంగా బరులు వెలిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *