సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణకు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నిర్వహించిన రాజకీయ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు చేసిన ఏర్పాట్లు వారికీ వివరించి ఎన్నికలు లో ఓటింగ్ పూర్తీ అయ్యాక ఎప్పటిలానే జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలోని ఓటింగ్ మిషన్ల రక్షణ కోసం భీమవరంలోని విష్ణు కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు లలో భద్ర పరుస్తామని, అక్కడే ఓట్ల , కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలు:1. ఆచంట (56)– విష్ణు కాలేజీ సీత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ లో 2. పాలకొల్లు(57)–విష్ణు స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్. 3, నరసాపురం (58)– విష్ణు స్కూల్ గ్రౌం డ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్. 4 భీమవరం (59)– విష్ణు కాలేజీ సీత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో స్ట్రాంగ్ రూమ్.ఏర్పాటు చేసి ఆడిటోరియంలోని 3,4 విభాగాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 5. ఉండి (60)– విష్ణు కాలేజీ సీత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ 2వ అంతస్తులో స్ట్రాంగ్ రూమ్, 6. తణుకు (61)– విష్ణు కాలేజీ స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్.7, తాడేపల్లిగూడెం (62)– విష్ణు స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్. ఏర్పాటు చేస్తున్నారు. ఇక నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం (09): పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు విష్ణు కాలేజీ ఫార్మసీ ఫస్ట్ ఫ్లోర్ క్లాస్రూమ్లో స్ట్రాంగ్ రూమ్, ఏర్పా టు చేశారు. వీటిలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ కేంద్రం , పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కౌం టింగ్ కేంద్రం వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు.
