సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపు లు కేటాయింపు పక్రియను షాపుల కేటాయించాలని అర్జీలు పెట్టుకున్న వారి సమక్షంలో అందరి పేర్లుతో చీటీల ద్వారా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేశామని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గత . గురువారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గీత కులాలకు కేటాయించిన 18 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియను టోకెన్ల ద్వారా స్వయంగా ఆయన లాటరీ తీశారు జిల్లాలోని 18 మద్యం షాపుల కోసం మొత్తం 478 దరఖాస్తులు అందాయని, ఈ లాటరీ ద్వారా 18 షాపులు కేటాయించామని, రెండు నెలలు ఫీజు రూ.95,83,333 రుసుం జమ చేసిన తరువాత షాపులను కేటాయిస్తామన్నారు. శెట్టిబలిజ–10, గౌడ–5, గౌడ్‌లు–2, శ్రీశయిన ఒక షాపును కేటాయించామన్నారు. మొత్తం 478 దరఖా స్తులకు గాను రూ.9 కోట్ల 56 లక్షలు నాన్ రిఫండబుల్ కింద ప్రభుత్వా ఎక్సయిజ్ శాఖకు జమా చెయ్యడంతో ఆదాయం లభించిందని అన్నారు.
