సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరంలో బైక్‌పై ముగ్గురు మైనర్లు అతి వేగంగా వెళుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ముగ్గరూ అక్కడికక్కడే మృతి చెందారు. గత ఆదివారం తెల్లవారు జామున సుమారు 1 – 2గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతులు ముగ్గురు తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించారు. శనివారం రాత్రి మాధవరం హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్‌లో స్నేహితుని పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు విద్యార్థులు మద్యం సేవించి, అర్ధరాత్రి ముగ్గురు యువకులు బయటకు వచ్చిన తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన వెంటనే తెల్లవారుజామునే అంత్యక్రియలు నిర్వహించారు అని తెలుస్తుంది. పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందటంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దీనిపై పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *