సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతం , ఉత్తర తమిళనాడు మరియు సరిహద్దు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతములో అల్పపీడనం ఏర్పడి కొనసాగుతున్నది .ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చల్లగాలులతో పాటు భీమవరం పరిసరాలలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి కూడా భారీ నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
