సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా భీమవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధరాత్రి మొదలు కొని ఉదయం 7 గంటల వరకు భారీ వర్షాలు కురియడం ఉదయం నుండి రాత్రి వరకు వర్షపు ముసురు కొనసాగుతుండటం ప్రజల దైనందిన కార్యక్రమాలకు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా వర్షము కురవడం కొంత మేలు చేస్తుంది.నిజానికి ఈ వర్షాకాలపు సీజన్ ప్రారంభం నుండి రాత్రిళ్లు వర్షాలు భారీగా పడటం విశేషం. జిల్లాలో రైతులు ఈ ఏడాది సార్వాలో వరి సాగు వేలాది ఎకరాల్లో నారుమళ్ళు వేయాల్సి ఉండగా కీలక సమయంలో వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *