సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజక వర్గాలలో కూడానేటి సోమవారం ఎన్నికల పోలింగ్ లో 80శాతం పైగా పోలింగ్ జరిగే అవకాశాలు స్వష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకే సుమారు 60 శాతం పోలింగ్ పూర్తీ అయిపొయింది. కాస్త భీమవరం నియోజకవర్గం ఓటింగ్ శాతంలో వెనుకబడి ఉంది. వాస్తవానికి చాల పోలింగ్ బూత్ లలో ఇవిఎం మిషన్స్ నెమ్మదిగా పనిచేస్తుండటం తో ఈ సమస్య ఏర్పడిందని, ఓటర్లు గంటల పాటు భారీ క్యూ లైన్ లలో నిలబడి నిరక్షిస్తున్నారని సమాచారం. వారికీ కావలసిన నీటి సౌకర్యాల విషయం లో వైఫల్యం కనిపిస్తుంది. వికలాంగులకు వృద్దులకు మాత్రం వెంటనే ఓటు వేయించి పంపుతున్నారు. ఇంకా సాయంత్రం 5 దాటిన ఓటర్లు క్యూ లైన్లలో వేచి చూస్తున్న నేపథ్యంలో .. అవసరమైతే PSM గర్ల్స్ హైస్కూల్ తదితర పోలింగ్ బూత్ సెంటర్స్ లో సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన ఓటర్లు అందరికి స్లిప్ లు ఇచ్చి వారి ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకొనే అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు ఈసీ కి విజ్ఞప్తి చేస్తున్నాయి.అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తలు తప్ప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతగా జరుగుతుంది.( ఫై తాజా చిత్రం భీమవరం PSM గర్ల్స్ హైస్కూల్లో }
