సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా ఆంధ్ర లో వాయుగుండా ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవ్వడం, అటు రైతులు పంట కోల్పోయి దిగాలు పడటంతో అందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన పడవద్దు అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన నేడు, ఆదివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం ఆయకట్టు ప్రాంతంలో భారీ వర్షాలకు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. తుపాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రికి తరలించాలని నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని, వరద బాధిత సమస్యలను తన దృష్టికి, అదికారులు తేవాలని మంత్రి నిమ్మల కోరారు.
