సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ కాంగ్రెస్అధ్యక్షురాలు, వై.ఎస్‌.షర్మిలానేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈనెల 9వ తేదీన అంటే రేపు శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో పాల్గొంటున్నారు. నేడు, గురువారం ఏలూరుజిల్లా దెందులూరులో రోడ్‌ షో, అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో సీఎం జగన్ , చంద్రబాబులు విఫలం అయ్యారని, ఏపీలో బీజేపీ తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి బీజేపీ పాలన ను కొనసాగిస్తున్నారని, ఇక్కడ అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల విమర్శించారు. ఆమె రేపు కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం కాకినాడ జిల్లా తునిలో జరిగే బహిరంగసభకు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *