సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా పాన్ సలార్’ సినిమా కేవలం 10 రోజులలో 600 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు వేసుంటే.. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సలార్’ కలెక్షన్స్ ప్రభంజనం.. భీమవరంలో సంచలనాలు రేపుతుంటే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్ ‘ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. నేటి ఆదివారం తో జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల దిశగా కలెక్షన్స్ సాధిస్తుంది.. ఇక భీమవరంలో 11 థియేటర్స్ లో విడుదలయిన సలార్ ‘ సినిమా ఎటువంటి బెనిఫిట్ షో లు లేకపోయిన కేవలం 6 రోజులలోనే 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించి ప్రభాస్ తన స్టామినా మరోసారి చూపించాడు. ప్రభాస్ నటించిన వరుస సినిమాలు.. బాహుబలి, బహుబలి 2, సాహో , రాదే శ్యాం, ఆదిపురుష్ తో పాటు ప్రస్తుతం సలార్ తో అన్ని సినిమాలు కోటి రూపాయలు కలెక్షన్ అధిగమించి భీమవరం బ్రాండ్ గా ప్రభాస్ పేరు సుస్థిరం చేసాయి.ప్రస్తుతం 3 థియేటర్స్ లో ప్రదర్శిస్తున్న సలార్’ నేటి ఆదివారం సలార్ సినిమా 10వ రోజు కలెక్షన్స్ కల్పి భీమవరం టౌన్ మొత్తంఫై 1కోటి 20 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది.
