సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్ర బాబు పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1న తణుకులో పర్యటన ఖరారు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్ లలో గృహ ప్రవేశాల కార్యక్రమానికి తణుకు నుంచే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు జాగ్రత్తలు పర్యటన ప్రాంతాలు ఆగమేఘాల మీద పరిశీలిస్తున్నారు. తణుకు నుండే పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సీఎం చేతుల మీదుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. తణుకు, తేతలి, మండపాక పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్లలో హౌసింగ్ లే అవుట్లను, తణుకు ఎస్ఎన్విఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలీపాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయూం అస్మి, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అధికారులతో కలిసి తాజగా పరిశీలిస్తున్నారు.సీఎం చంద్రబాబు పర్యటన తణుకు కు మాత్రమే పరిమితం చేస్తారా? లేక జిల్లాలో మరిన్ని ప్రాంతాలలో పర్యటించే అవకాసమ్ ఉందా ? షెడ్యూలు లో ఖరారు కావలసి ఉంది.
