సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 58 ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులను గతంలో సర్వర్ సమస్యల వల్ల నిలిపివేసినప్పటికీ ఇటీవల మరల జారీ చేస్తోంది, వీటిని గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో పొందవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 3 లక్షల మంది వృద్దులు ఉండగా చాల కొద్దీ మంది మాత్రమే ఈ కార్డ్స్ తీసుకొన్నారు. కావున అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ కాపీ, పాస్‌పోర్టు సైజు ఫొటో, వయసు ధృవీకరణ పత్రం, బ్లడ్ గ్రూప్, అడ్రస్ ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు వంటి వివరాలతో సచివాలయానికి వెళ్లాలి.. అక్కడ ఈ వివరాలను నమోదు చేసి సీనియర్‌ సిటిజన్‌ కార్డును జారీ చేస్తారు. ఇది సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలు పొందడానికి సులువు చేస్తుంది. ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు అంతగా అవసరం లేదు. ఆశ్రమాల్లో సేవలు, ఆర్టీసీ బస్సుల్లో రాయితీ పొందవచ్చు. రైళ్లలో కింది (లోయర్) బెర్తులు కేటాయిస్తారు. కోర్టులు కేసుల విచారణలో ప్రాధాన్యం ఇస్తాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఇది సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *