సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పర్వదినాలు అయ్యాక అందురు ఊహించినట్లే.. కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత శుక్రవారం 596 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలు ఉంటున్నాయి , అయితే పరిస్థితి మాత్రం పూర్తీ అదుపులోనే ఉంది. తీవ్ర చలిగాలులు వల్ల కూడా ప్రజలు జలుబు, దగ్గు వంటి వైరల్ వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా అనుమానాలతో హాస్పటల్స్ వచ్చే వారి సంఖ్య, కోవిద్ టెస్టులు చేయించుకొంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక కరోనా కట్టడి చెయ్యడానికి ప్రభుత్వ, ప్రెవేటు కలపి, ఇప్పటికే జిల్లాలో 55 కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేసి నోడల్ అధికారులను నియమించారు. మొదటి, రెండో కొవిడ్ కాలంలో పనిచేసిన తాత్కాలిక సిబ్బంది నుంచి మూడో దశలో సేవలందించేందుకు దరఖాస్తులను తీసుకున్నారు. కొవిడ్ కేంద్రాలు, ఆసుపత్రులకు అవసరమైన సిబ్బందిని వచ్చే సోమవారం నుంచి డ్యూటీలు వేస్తున్నారు. ఇక సోమవారం నుంచి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు(సీసీసీ) పారంభించడానికి క్షేత్ర స్థాయి ఏర్పాట్లను శరవేగంగా పూర్తీ చేస్తున్నారు.
