సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో హమాలీ చార్జీల కోసం సుమారు 4 నెలలుగా డిమాండ్ చేస్తున్న రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. జిల్లాలో 70,965 మంది రైతుల ఖాతాల్లో రూ.10.68 కోట్లు జమ అయ్యాయి.గత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సొమ్ములైతే 24 గంటల్లోపు రైతుల ఖాతాలో జమ య్యాయి. కానీ హమాలీ సొమ్ములు ఇంతకాలం పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇటీవల రవాణా భత్యం పెంపుదల చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ వేసి ధర నిర్ణయించి అది కూడా చెల్లిస్తామని జిల్లా సివిల్ సప్లయిస్ డీఎం మహ్మద్ ఇబ్రహీం ప్రకటించారు.
