సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో పేద పిల్లలకు 273 ప్రైవేటు స్కూల్స్ లో, జిల్లా విద్యా శాఖ ఉచిత సీట్లు కేటాయించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లాలో ఈ ఏడాది 1047 మంది విద్యార్థులు ఉచిత సీట్లు సాధించారు. బడ్జెట్ పాఠశా లల్లోనూ విద్యా శాఖ ఉచిత అడ్మిషన్లు కల్పిస్తోంది.. వారందరికీ ఈ కొత్త విద్య సంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. గత ఏడాది విద్యా శాఖ కేటాయించిన సీట్లకు ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఫీజులు జమాచేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.11,500 వంతున చెల్లిస్తారు. పేద విద్యార్థి ఐదు కిలోమీటర్ల పరిధిలోవున్న పాఠశాలలనే ఎంపిక చేసుకోవలసి ఉంది. .
