సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యా తగ్గిస్తున్నారంటూ అలాగే వృద్ధుల పింఛనులలో భారీ కోత విదిస్తున్నారంటూ ప్రచారం ప్రజలు మధ్య చర్చ ఉపందుకొంది. నిజానికి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ పధకాలు పారదర్సకంగా నిర్వహిస్తున్నప్పటికీ వాటిని పొందటం లబ్దిదారులకు రానురాను కష్టంగా మారిపోతుంది. సచివాలయాలు కు వెళ్లి కేవలం 2వారాలలో అర్హతల పత్రాలు సాధించి నిరూపించుకోవాలని .. విద్యుత్తు వినియోగం 300యూనిట్లు దాటిందని, ఇంట్లో కారు ఉందని.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా రని.. పరిమితికి మించి ఇంటి స్థలం ఉందని.. నోటీసులు ఇస్తున్నారు. 3 ఎకరాల పొలం ఉండవచ్చు కానీ 3 సెంట్లు స్థలంలో ఇల్లు ఉండకూడదు. స్వంతకారు తో డ్రైవర్ గా జీవన వృతి చేసుకునేవారికి ఇబ్బందే.. ఎదో ఇంట్లో కుటీర పరిశ్రమ చేసుకొంటారు. అయితే 300 యూనిట్స్ కరెంట్ బిల్లు దాటకూడదు. దీనితో ఇదెక్కడి బాధ అని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మధ్యతరగతి ప్రజలు దాదాపు అర్హతలు కోల్పోతున్నారు. వృద్ధుల పింఛను లు 2750 పెంచుతామని ప్రకటించి మరో వైపు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా 6,237 మందికి నోటీసులు లబ్ధిదారులకు అర్హత నిరూపించుకోవాలంటూ అధికారులు జారీ చెయ్యడం, దానితో లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ పరుగులు పెడుతున్నారు. ఒక ప్రక్క పండుగలు పెట్టుకొని ఎదో రకంగా పింఛను నిలబెట్టుకోవాలనో , పేద మధ్యతరగతి విద్యార్దుల తల్లితండ్రులు అయితే విద్య దీవెన, వసతి, పీజు రియంబర్స్ మెంట్ నిలబెట్టుకోవాలనో తపన,ఆందోళన కనపడుతుంది. అయితే స్థానిక అధికార వైసిపి నేతలు, వాలంటర్స్ సహకారం ఉన్నపటికీ, నిజమైన పేద లబ్దిదారులకు కూడా కుటుంబ పరంగా ఎన్నో బాధ్యతలుతో లబ్ధిదారుల అర్హతలు కోల్పోవడం తప్పటం లేదు. జగన్ సర్కార్ కూడా వాస్తవ దృష్టితో అలోచించి అర్హతలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి కొన్ని సడలింపులు చెయ్యవలసి ఉంది.
