సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఉండి లో శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక కాపునేతల మరియు వైసీపీ కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా మరియు వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు హాజరయ్యారు. గతంలో కాపులును ఎంతో హీనంగా చుసిన చంద్రబాబు దగ్గర కాపులు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్ ను అయన మద్దతు ఇస్తున్న చంద్రబాబు పార్టీలను నమ్మవద్దని పిలుపు ఇచ్చారు. కేవలం డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? విలువలు అక్కరలేదా? అని పవన్ కల్యాణ్‌ను పద్మనాభం ప్రశ్నించారు. చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అణిచివేశారని.. అలాంటి ఆయనతో పవన్ కల్యాణ్ చేతులు కలిపారని విమర్శించారు. గతంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీ ఫై తాను ఉద్యమిస్తుంటే.. చంద్రబాబు తన కుటుంబ సభ్యులను జైల్లో బంధించారని, పోలీసులతో బూతులు తిట్టించి దారుణంగా అవమానించారని అన్నారు. ఆ సమయంలో తమకు తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆ క్రమంలో తాము వాష్ బేసిన్‌లో నీళ్లు తాగామని ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాడు తమ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం హింసిస్తుంటే.. పవన్ ఒక్క రోజు కూడా చంద్రబాబు ను ప్రశ్నించ లేదన్నారు. పవన్ కనీసం రాష్ట్రంలో జిల్లాకో సిటు కూడా పోటీ చెయ్యలేని స్థితిలో చంద్రబాబు పంచన చేరి కాపులను అవమానిస్తూ కేవలం 21 సీట్ల కోసం టీడీపీ తో జత కట్టిన నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని నేను నీ దగ్గరకు రావాలి అంటూ పవన్‌పై పద్మనాభం నిప్పులు చెరిగారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరిన తనను ఇప్పుడు నానా బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా పార్టీ నడుపుతున్న మీకొక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? అని ఎద్దేవా చేశారు. కాపులు కు సీఎం జగన్ మేలు చేస్తున్నారని, చంద్రబాబులా ఓట్లు కోసం దొంగ హామీలు ఇచ్చి అవమానించడం లేదని అన్నారు ముద్రగడ..
