సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు, బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులను కలుస్తూ పొలాలను పరిశీలిస్తూ పర్యటన పర్యటిస్తున్నారు. అయన మాటలలో.. పశ్చిమ గోదావరిలో రైతులకు కూటమి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని, గత వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్నదాతలు కు చేసేదేమీ లేక క్రాప్ హాలిడే ప్రకటించారని అన్నారు.. జగన్ దుర్మార్గుడు.. లక్షల కోట్లు అప్పు చేసి పోయారని ,జగన్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీ కడుతోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ కాలువలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జగన్ పోలవరాన్ని ముంచేశారని . దిక్కుమాలిన పేపర్, దిక్కుమాలిన టీవీతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *