సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రహదారులు, డ్రెయిన్‌లు నిర్మించారు. అయితే తాజాగా స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ (సాస్కీ) పథకంలో నాబార్డు నుంచి పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్రానికి ఉచిత వడ్డీపై రుణాలను ఏపీలో అన్ని జిల్లాలకు కలపి రూ.2,122.97 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి ఫేజ్‌లో పశ్చిమ గోదావరికి రూ.111.01 మంజూరు అయ్యాయి. వీటితో ఇప్పటికే పంచాయతీల నుంచి సీసీ రహదారుల కోసం ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు పరిశీలించి 207.93 కిలోమీటర్ల మేర 97 సీసీ రహదారులు నిర్మించడానికి ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. వీటికి అతి త్వరలో కాంట్రాక్టర్స్ కు టెండర్లు పిలిచి నూతన రోడ్డు పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *