సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది 2025 వచ్చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఇష్టమైన సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభం అవుతుంది. అందుకే తాజగా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే అన్ని రెగ్యులర్ సర్వీసులకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ పూర్తీ కావడంతో అధికారులు మరిన్ని స్పెషల్ సర్వీసులను వచ్చే జనవరి నెల 9 వ తేదీ నుంచి 13 వరకు 113 సర్వీసులు అదనంగా నడపాలని నిర్ణయించారు. వీటిలో సింహభాగం బస్సులు జిల్లా కేంద్రం భీమవరంకే కేటాయించనున్నారు. ఇప్పటికే కొన్ని స్పెషల్ బస్సులు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. జనవరి 10వ తేదీన ముక్కోటి, 11న రెండో శనివారం, 12 ఆదివారం 13వ తేదీ సోమవారం భోగి 14న మంగళవారం సంక్రాంతి, 15న బుధవారం కనుమ రావటంతో వరసగా సెలవులురావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. జనవరి 15 నుంచి 20 వరకు హైదరాబాద్ వెళ్లేందుకు జిల్లాకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా మరో 79 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు.
