సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ముగింపు దశకు చేరుకొన్నాయి. ఇక ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. పది పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది ఫలితాలు బాగా వెనుకబడటంతో ఈసారి ఉపాధ్యా యులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు చేపట్టారు. ఈసారి జిల్లాలో 121 పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు బాలురు 10,444, బాలికలు 10,175 మొత్తం 20,619 మంది పరీక్ష రాయనున్నారు. ఒక్కసారి ఫెయిల్ అయిన విద్యార్థులు బాలురు 2,485, బాలికలు 1482, మొత్తం 3,967 మంది ఈసారి పరీక్ష రాయనున్నారు.
