సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో గత మార్చిలో నిర్వహించిన టెన్త్ పరీక్షల్లోప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 20,268 మంది పరీక్షలకు హాజరుకాగా కేవలం 13,362 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,933 మంది బాలురు, 2,973 మంది బాలికలు ఫెయిల్ అయిన నేపథ్యంలో వీరికి వచ్చే నెల 2వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది లెక్కలు సబ్జెక్టులో ఫెయిల్ కాగా వారందరిపై ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. జిల్లాలోని 389 జిల్లాపరిషత్ హైస్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యా ర్థులను చదివిస్తున్నారు. . ఈ నేపథ్యంలో భీమవరం పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికల హైస్కూల్లో టెన్త్ విద్యార్థులకు శిక్షణ తరగతులు కు విద్యార్థుల నుండి విశేష స్వాందన వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *