సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద ముఖ్య మంత్రి జగన్ 81,294 మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.152.42 కోట్లు జమా చేశామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో నమూనా చెక్కును లబ్ధిదారులకు ఆమె అందజేశారు. జిల్లాలో ఆసరా నిధులు అందిన నియోజకవర్గాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.. భీమవరం నియోజకవర్గంలో 12,546 మంది మహిళలకు రూ.23.52 కోట్లు,ఆచంటలో 11,970 మంది మహిళలకు రూ.22.44 కోట్లు, నరసాపురం లో 7,521 మంది మహిళలకు రూ.14.10 కోట్లు, పాలకొల్లులో 12,027 మంది మహిళలకు రూ.22.55 కోట్లు, తాడేపల్లిగూడెం లో 10,721 మంది మహిళలకు రూ.20.10 కోట్లు, తణుకులో 12,396 మంది మహిళలకు రూ.23.24 కోట్లు, ఉండి లో 14,113 మంది మహిళలకు రూ.26.46 కోట్లు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *