సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజలకు మరింత సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల సేవలు కూడా అందించేందుకు రాష్ట్రంలో జగన్ సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 17 గ్రామాలలో సచివాలయ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ పక్రియ ప్రారంభం అవుతుంది. ఉండి మండలం పెదపుల్లేరు సచివాలయంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలులో ఉంది. అక్కడ ఇప్పటి వరకు 50 దస్త్రాలను రిజిస్ట్రేషన్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ తెలిపారు. కొన్ని నెలల పాటు సచివాలయ ఉద్యోగులకు రిజిష్టర్ ఉద్యొగులు శాఖాపరంగా తర్పీదు ,సహకారం అందిస్తామని ప్రకటించారు. తాజాగా జిల్లాలో 16 సచివాలయాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు.. ఆ సచివాలయాల వివరాలు: కొవ్వాడ, కుముదవల్లి, వేంపాడు, కంసాల బేతపూడి, కరుగోరుమిల్లి, ఉత్తరపాలెం , గుమ్మంపాడు, శేరేపాలెం , అజ్జరం, పెమ్మ రాజు పోలవరం, బూరుగుపల్లి, కస్పా పెంటపాడు, వెంకట్రామపురం, వెలగలేరు, కన్నయ్య ముద్దాపురం ,కర్రావారి సావరం సచివాలయాలను ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *